అఖిల్‌ సినిమాకి భలే ఊపొచ్చిందిలే.!

By iQlikMovies - January 16, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతి సీజన్‌కి సంబంధించి రావల్సిన సినిమాలొచ్చేశాయి. అందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే, మరికొన్ని డిజాస్టర్‌ టాక్‌తో రన్‌ అయ్యాయి. ఇంకొన్ని చర్చల్లోనే లేకుండా పోయాయి. ఇక నెక్ట్స్‌ సీజన్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఈ సీజన్‌లో ఆకర్షించేది అక్కినేని హీరో అఖిల్‌. అఖిల్‌ హీరోగా 'మిస్టర్‌ మజ్ను' సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని కాంపౌండ్‌ నుండి ఈ ఏడాది పక్కా హిట్‌ అందుకోలేదు. 

 

నాగచైతన్య నుండి గతేడాది రెండు సినిమాలొచ్చాయి. 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి'. ఈ రెండూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకోలేకపోయాయి. ఇక నాగార్జున, నానితో కలిసి చేసిన 'దేవదాస్‌' ఫర్వాలేదనిపించింది. సో అక్కినేని అభిమానులంతా అఖిల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అఖిల్‌ కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్‌ కొట్టి తీరాలి. ఎందుకంటే అఖిల్‌కి ఇది మూడో సినిమా. ఈ సినిమాతోనైనా హీరోగా తన ఉనికిని చాటుకోవాలి. 

 

తొలి సినిమా 'అఖిల్‌' డిజాస్టర్‌ కాగా, రెండో సినిమా 'హలో' కథ పరంగా ఓకే అయినా, అఖిల్‌ ఎనర్జీకి ఆ సినిమా సరిపోలేదు. డల్‌గా సాగటంతో ఫ్యాన్స్‌ అంతగా కనెక్ట్‌ కాలేకపోయారు. ఇక తాజా చిత్రం 'మిస్టర్‌ మజ్ను' విషయానికి వస్తే, ఈ సినిమాలో అఖిల్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ప్రచార చిత్రాలతో బాగా ఆకట్టుకుంటున్నాడు. నిధి అగర్వాల్‌ గ్లామర్‌ అదనపు ఆకర్షణ కానుంది. అన్నింటికీ మించి 'తొలిప్రేమ' సినిమాతో యూత్‌ పల్స్‌ బాగా పట్టేసిన డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడు. సో ఈ సినిమాతో అఖిల్‌కి ఈ ఏడాది హిట్‌ పక్కా అంటున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS