'మన దగ్గర బేరాల్లేవమ్మా..' అంటూ షేక్ చేసేస్తున్నాడు మహేష్ బాబు. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌లో మహేష్ మాటల తూటాలు బాగా పేలాయి. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతో, ఎమోషన్ ఎంతో, హీరోయిజం ఎంతో ఆ ఒక్క టీజర్‌తోనే అర్థమైపోయింది. మహేష్ అభిమానులకే కాదు, అందరికీ ఈ టీజర్ విపరీతంగా నచ్చేసింది. అందుకే యూ ట్యూబ్‌లో 'సరిలేరు నీకెవ్వరు' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన టీజర్‌గా సరికొత్త సౌత్ ఇండియా రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఈ టీజర్ కి 18 మిలియన్ల హిట్స్ వచ్చాయి. ఇది వరకు ఈ రికార్డు సాహో పేరుతో ఉండేది. సాహోకి 17 మిలియన్ హిట్స్ వచ్చాయి. సర్కార్ (16 మిలియన్లు), మహర్షి (12.6 మిలియన్లు), మెర్శల్ (12 మిలియన్లు) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేస్తున్నారు.