ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి సెన్సేషనల్ అయిపోయిన హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు హీరో కాదు, ఓ బ్రాండ్. ఆయన ఏది చేస్తే అదే యూత్‌లో క్రేజ్.. అంతలా ఆయన ఇమేజ్ మారిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ ఈ సినిమాకి దర్శకుడు. దీంతో పాటు ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో 'ఫైటర్' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదంతా తెలిసిన సంగతే.
అయితే, తాజా సమాచారం ఏంటంటే, దేవరకొండకీ ఓ బ్రదర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన హీరోగా డెబ్యూ చేసిన సంగతి కూడా తెలిసిందే. అదే 'దొరసాని' మూవీ. అన్నయ్యకున్న ఇమేజ్‌తో ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేసుకోగలిగాడు కానీ, రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాడు. అయితే, తమ్ముడి సినిమా విషయంలో అన్నయ్య దేవరకొండ కూడా పెద్దగా వేలు పెట్టలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు మన దేవరకొండ మనసు మార్చుకున్నాడట.
తమ్ముడి కెరీర్‌ని కూడా గాడిన పెట్టాలని డిసైడ్ అయ్యాడట. దాంతో, ఆయన సినిమాలో తానూ ఓ చేయి వేయాలనుకుంటున్నాడట. త్వరలోనే ఆనంద్ దేవరకొండ నటించబోయే సినిమాలో విజయ్ దేవరకొండ కూడా కనిపించనున్నాడనీ తెలుస్తోంది. అయితే, ఇదో మల్టీ స్టారర్ మూవీ అవుతుందా.? లేదంటే, విజయ్ దేవరకొండ, ఆనంద్ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తాడా.? అనేది చూడాలిక.