మ‌హేష్ Vs ప‌వ‌న్‌.. పై చేయి ఎవ‌రిది?

By Gowthami - March 01, 2021 - 10:18 AM IST

మరిన్ని వార్తలు

2022 సంక్రాంతికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టి నుంచే అంద‌రి క‌ళ్లూ.. అటు వైపుకు తిరిగాయి. ఈ సంక్రాంతికి ఎవ‌రిది పై చేయి అవుతుందా? అనే చ‌ర్చ ఇప్పుడే మొద‌లైపోయింది. కార‌ణం.. 2022 సంక్రాంతికి ఇద్ద‌రు పెద్ద హీరోలు ఇప్పుడే... స‌మ‌ర రంగంలో దిగుతామ‌ని ప్ర‌క‌ట‌న చేసేశారు. 2022 సంక్రాంతి క‌ర్చీఫ్ లు రెడీ చేసేసుకున్నారు. ఆ హీరోలు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్‌. మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. 2022 సంక్రాంతికి వ‌స్తామంటూ.. చిత్ర‌బృంం ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది.

 

మ‌హేష్‌కి సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజ‌న్‌. కాబ‌ట్టి.. మ‌హేష్ ముందుగా క‌ర్చీఫ్ వేసేసుకున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ వంతు వ‌చ్చింది. 2022 సంక్రాంతికి ప‌వ‌న్ - క్రిష్ సినిమా విడుద‌ల కాబోతోంది. ఒకే సీజ‌న్‌లో ప‌వ‌న్ - మ‌హేష్ ల సినిమాలు వ‌స్తుంటే, బాక్సాఫీసుకి పండ‌గే. కాక‌పోతే.. ఇద్ద‌రిలో ఎవ‌రిది పై చేయి అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అటు మ‌హేష్‌, ఇటు ప‌వ‌న్ అభిమానులు ఇప్ప‌టి నుంచే.. `మాదంటే మాదే విజ‌యం` అంటూ సోష‌ల్ మీడియా సాక్షిగా కాల‌ర్లు ఎగ‌రేస్తున్నారు. క‌చ్చితంగా ఈ రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలుంటాయి.

 

ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయి. కానీ... విజ‌యం ఎవ‌రికి చేకూరుతుంది? 2022 సీజ‌న్‌కి ఎవ‌రు గ్రాండ్ గా ప్రారంభిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఈ రెండు సినిమాలేనా? కొత్త‌గా స్టార్లెవ‌రైనా, ఈ సీజ‌న్‌లో పోటీ ప‌డ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ప్ర‌స్తుతానికైతే 2022 సంక్రాంతి వార్‌.. మ‌హేష్‌, ప‌వ‌న్ ల మ‌ధ్యే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS