పవన్ కల్యాణ్ సినిమా అంటే రికార్డులకు పండగే. సినిమా ఫ్లాప్ అయినా, తొలి మూడు రోజుల వసూళ్లు ఆకాశాన్నంటేస్తాయి. ఆ వసూళ్లతోనే నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడు. అందుకే ఫ్లాపులొచ్చినా పవన్ క్రేజ్ తగ్గలేదు. సుదీర్ఘ విరామం తరవాత పవన్ ఇప్పుడు `వకీల్ సాబ్`గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే నాన్ థియేటరికల్ రైట్స్ డీల్ క్లోజ్ అయిపోయింది.
అమేజాన్ ప్రైమ్ కి ఓటీటీ హక్కులు దక్కాయి. జీ శాటిలైట్ హక్కుల్ని కైవసం చేసుకుంది. ఈ హక్కుల రూపంలో దిల్ రాజుకి 50 కోట్లు ముట్టాయని టాక్. పవన్‌కి ఇచ్చిన పారితోషికం కూడా 50 కోట్లే. అంటే.. పవన్ పారితోషికం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో లాగేశాడన్నమాట. తమిళ, హిందీ డబ్బింగుల రూపంలో మరికొంత భారీ మొత్తం ముడుతుంది.
కనీసం 60 నుంచి 70కోట్ల వరకూ బిజినెస్ చేయాలన్నది దిల్ రాజు వ్యూహం. దిల్ రాజు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా నుంచి 50 కోట్ల లాభం పొందొచ్చు.