కరోనా కాలమిది. ఏ ప్రాజెక్టు ఎప్పుడు ఊడుతుందో, ఏ సినిమా ఎవరి చేతుల్లోంచి జారుతుందో చెప్పలేం. `ఈ సినిమా ఆగిపోయింది` అని చెప్పినా పెద్దగా కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. `కరోనా కష్టాలు` అని సరిపెట్టుకోవడమే. అందుకే దర్శకులు గుబులు గుబులుగా గడిపేస్తున్నారు. తమ చేతుల్లోని ప్రాజెక్టు.. చేజారిపోతోందేమో అని. ప్రస్తుతం పరశురామ్‌కీ అలాంటి గుబులే మొదలైంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా `సర్కారు వారి పాట` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు గానీ, మహేష్ లుక్, మోషన్ పోస్టర్ రెండూ బయటకు వచ్చేశాయి. అయితే.. ఈ ప్రాజెక్టుని కాంట్ బట్ పొజీషన్ లో ఓకే చెప్పాడు మహేష్. అందుబాటులో పెద్ద దర్శకులు ఎవరూ లేకపోవడంతో, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ కథకి తలాడించాడు. అయితే... ఇప్పుడు త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడు. ఇటీవల త్రివిక్రమ్ - మహేష్ మధ్య భేటీ జరిగింది. అది సినిమా కోసమే అని టాక్. ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉండడంతో - త్రివిక్రమ్ ఖాళీ అయ్యాడు. ఈ గ్యాప్ లో మహేష్ తో ఓ సినిమా చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. త్రివిక్రమ్ కథ మహేష్ ని బాగా టెప్ట్ చేస్తే, పరశురామ్ సినిమాని పక్కన పెట్టి, త్రివిక్రమ్ సినిమా మొదలెట్టేసినా, ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే.. పరశురామ్ ఆందోళన చెందుతున్నాడట. కాకపోతే.. తన సినిమా పనుల్ని మాత్రం ఓ వైపు చురుగ్గా చేసుకుంటూ, మహేష్‌కి సదా టచ్ లో ఉంటున్నాడు. ఈ వారంలో త్రివిక్రమ్ తో మహేష్‌కి మరోసారి భేటీ ఉంది. ఆ తరవాతే.. ప్రాజెక్టు ఉంటుందా, ఉంటే ఎప్పుడు అనే విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకూ పరశురామ్ కి ఈ టెన్షన్ తప్పదు.