ఓ టాప్ స్టార్ సినిమా మొదలవుతుందనగానే బిజినెస్ పూర్తయిపోవడం చాలా సహజం. కాకపోతే.. ఇది కరోనా సీజన్. పైసా పెట్టుబడి పెట్టడానికి సైతం భయపడిపోతున్నారు. అందుకే.. బిజినెస్ పరంగా టాలీవుడ్ లో ఎలాంటి కదలికలూ లేవు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ మహేష్ బాబు తన స్టామినా చూపించేస్తున్నాడు.
మహేష్ కొత్త సినిమా `సర్కారు వారి పాట`. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వలేదు. అప్పుడే మహేష్ తన రికార్డుల వేటకు శ్రీకారం చుట్టేశాడు. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఏకంగా 35 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్. మహేష్ సినిమాల్లో ఇదే రికార్డు. ఈ సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు` సినిమా హిందీ శాటిలైట్ రికార్డుని సర్కారువారి పాట బద్దలు కొట్టింది. త్వరలోనే అమెరికాలో 45 రోజుల పాటు కీలకమైన షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ శ్రీకారం చుట్టుకోనుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. అనిల్ కపూర్ ని ఓ కీలకమైన పాత్ర కోసం సంప్రదిస్తున్నారట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.