స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం యుట్యూబ్ లో ఒక పెను సంచలనం రేపింది అనే చెప్పాలి.
ఈ చిత్రం తాలుకా హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో పెట్టిన ఆరునెలల్లో సుమారు 10కోట్ల వ్యూస్ తో డబ్బింగ్ చిత్రాల క్యాటగిరిలో ఒక కొత్త రికార్డు సృష్టించేసింది అనే చెప్పాలి. ఈమధ్యకాలంలో తెలుగు చిత్రాలని డబ్బింగ్ చేసి హిందీ ప్రేక్షకులకి అందిస్తున్నారు అక్కడి ప్రజలు కూడా ఈ చిత్రాలకి బ్రహ్మరథం పడుతున్నారు.
మన పైన చెప్పుకున్న విషయమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇక ఇప్పటికే మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు హిందీలోను అతని మార్కెట్ పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సరైనోడు చిత్రంతో ఇక్కడ 100 కోట్లు కొల్లగొట్టి మళ్ళీ హిందీలో దాదాపుగా 10కోట్ల వ్యూస్ తో అల్లు అర్జున్ కి ఇది మరపురాని చిత్రంగా మిగిలిపోయింది.