కోవిడ్ ధాటికి... టాలీవుడ్ అతలాకుతలం అయ్యింది. థియేటర్లు మూతబడ్డాయి. రిలీజులు ఆగిపోయాయి. ఎట్టకేలకు ఇప్పుడు... లాక్ డౌన్ నిబంధనల్ని సడలించారు. ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు లభించాయి. అయితే ఇప్పటి వరకూ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలేం రాలేదు. ఈ నేపథ్యంలో తొలి అడుగు పడింది. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా రిలీజ్ కబురు వినిపించింది. తొలి అడుగు.. `తిమ్మరుసు` వేయబోతున్నాడు.
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం తిమ్మరుసు. షరన్ కొప్పిశెట్టి దర్శకుడు. ప్రియాంక జవాల్కర్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఈనెల 30 న విడుదల చేయనున్నారు. సెకండ్ వేవ్ తరవాత... టాలీవుడ్ నుంచి విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే. అతి త్వరలోనే తిమ్మరుసు ట్రైలర్ ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం, నారప్ప చిత్రాలు సైతం విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే రిలీజ్ డేట్లు మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.