ముద్దుగుమ్మ త్రిష టైం స్టార్ట్స్‌!

మరిన్ని వార్తలు

తెలుగులో స్టార్‌ హీరోస్‌ అందరితోనూ నటించి, నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా పాపులరైన ముద్దుగుమ్మ త్రిష. అందానికి అందం, అభినయానికి అభినయం.. అన్నీ కలగలిపిన రూపం త్రిష సొంతం. అయితే నిశ్చితార్ధం, పెళ్లి అంటూ నటన నుండి కొంచెం గ్యాప్‌ తీసుకున్న త్రిష, ఇతరత్రా కారణాలతో వివాహం రద్దు కావడంతో మళ్లీ సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అయితే తెలుగులో త్రిషకు పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ, తమిళంలో మాత్రం ఆమె స్టార్‌ హీరోయినే ఇప్పటికీ. సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాక ఆమె సక్సెస్‌కి బ్రేకులే లేవు. అన్నీ పెద్ద ప్రాజెక్టులే. అవి కూడా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలున్నాయో వేళ్ల మీద లెక్కేయడం కష్టమే. తాజాగా తమిళంలో విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'పరమపదం' సినిమాలో త్రిష హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. ఆ సినిమాలో త్రిష డాక్టర్‌ క్యారెక్టర్‌ లో నటిస్తోంది. తాను ఇంతవరకూ చేసిన పాత్రలన్నింట్లోనూ ఈ పాత్ర చాలా కొత్తగా విభిన్నంగా ఉండబోతోందట. ఇవి కాక 'మోహిని', 'గజరాణి' తదితర కథా నాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలు త్రిష చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ వేటికవే విలక్షణ చిత్రాలు కావడం విశేషం. క్యారెక్టర్‌కి తగ్గట్లుగా తనని తాను మలచుకునే ప్రయత్నంలో త్రిష బిజీగా ఉంది. తెలుగులోనూ మంచి అవకాశాలొస్తే నటించేందుకు ముద్దుగుమ్మ త్రిష రెడీగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS