అందరూ ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తోన్న 'రాజుగారి గది - 2' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటించగా, సమంత దెయ్యం పాత్రలో కనిపించింది. కాగా హీరోయిన్ లీడ్‌ని ముద్దుగుమ్మ సీరత్ కపూర్ పోషించింది. హీరోయిన్గా సీరత్ కపూర్ నటన ఆకట్టుకుంది. 'రన్ రాజా రన్' సినిమాలో క్యూట్ అండ్ బబ్లీ గాళ్‌గా కనిపించిన సీరత్‌కి 'రాజుగారి గది - 2'తో మంచి ఆఫర్ దక్కింది. ఈ సినిమాలో దెయ్యం సీరతేనా అనే అనుమానం కలిగేలా ఆమె నటన ఉంటుంది. గ్లామర్‌తో పాటు, నటనతోనూ ఆకట్టుకుంది. కొన్ని సీన్స్‌లో అయితే కళ్లతోనే ఎన్నో భావాలు పలికించేసింది సీరత్. ఈ ముద్దుగుమ్మకి కొరియోగ్రాఫర్‌గా పని చేసిన అనుభవం ఉన్నందున డాన్సులు ఇరగదీసేస్తుంది. అలాగే ఈ సినిమాతో గొంతు కూడా సవరించుకుంది. సింపుల్‌గా ఓ బిట్ సాంగ్ పాడేసి, శ్యాంపిల్ విసిరింది. ఇక అందాల ప్రదర్శన విషయానికి వస్తే, సీరత్ అందాలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అందాల ఆరబోతలో కంచెలు దాటేసిందీ బ్యూటీ. గ్లామర్ డాళ్‌గా కనిపించినప్పటికీ, ఈ సినిమా తనకో మంచి ఎక్స్పీరియన్స్ అంటోంది సీరత్. నాగార్జున వంటి సీనియర్ హీరోతో నటించడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటోంది ముద్దుగుమ్మ సీరత్. అంతేకాదండోయ్ అందాల ఆరబోత విషయంలో ఈ చిన్నదానికి కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయటండోయ్. క్యారెక్టర్‌కి తగ్గట్లుగా మాత్రమే తన ఎక్స్పోజింగ్ ఉంటుంది తప్ప, అనవసరంగా శృతి మించననీ చెబుతోంది మరి!