వ‌ర్జిన్ స్టార్‌... వ‌స్తున్నాడు

By iQlikMovies - April 15, 2021 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

ఆమ‌ధ్య `స‌హ‌రి` అనే ఓ చిన్న సినిమా ఓపెనింగ్ కి వెళ్లా బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచీ.. ఆ సినిమాకి బోలెడంత ప్ర‌మోష‌న్ వ‌చ్చేసింది. బాల‌య్య సెల్ ని విసిరి కొట్ట‌డం, `విర్గో` అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని `వ‌ర్జిన్‌` అని పిల‌వ‌డం... ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో భ‌లే వైర‌ల్ అయ్యాయి. మీమర్స్‌కి... పండ‌గ‌లా ఈ ఫుటేజ్ దొరికేసింది. దాంతో బోలెడంత కామెడీ దొరికింది. దాంతో పాటు. స‌హ‌రి అనే సినిమాకి ఫ్రీ ప‌బ్లిసిటీ కూడా దొరికేసింది.

 

ఇప్పుడు `స‌హ‌రి` టీమ్ నుంచి ఓ టీజ‌ర్ వ‌స్తోంది. దానిక్కూడా బాల‌య్యని వాడుకున్నారు. `స‌హ‌రి` ఓపెనింగ్ రోజున బాల‌య్య చేసిన హంగామాని.. ఫుటేజీగా వాడుకుంటూ, `వ‌ర్జిన్ స్టార్‌` అనే బిరుదుని హీరోకి త‌గిలిస్తూ.. బాల‌య్య చంప‌దెబ్బ‌ల్ని హైలెట్ చేస్తూ ఓ టీజ‌ర్ ప్రోమోని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈనెల 16న బాల‌య్య చేతుల‌మీదుగానే టీజ‌ర్ నీ విడుద‌ల చేస్తున్నార్ట‌. బాల‌య్య చేసిన హంగామానే... మ‌ళ్లీ ఓ ప్ర‌మోష‌న్ కి వాడుకుంటున్నారంటే.. `స‌హ‌రి` టీమ్ ఎంత తెలివైన ఎత్తుగ‌డ వేసిందో అర్థం చేసుకోవొచ్చు. బాల‌య్య‌ని ఇలాక్కూడా వాడేస్తారా? అని ఆశ్చ‌ర్య‌పోయే లెవిల్లో.. టీజ‌ర్ ప్రోమోని క‌ట్ చేశారు. హ‌ర్ష్ కానుమ‌ల్లి, సిమ్రాన్ చౌద‌రి జంట‌గా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS