మరోసారి 'ఫిదా' చేస్తానంటోన్న శేఖర్‌ కమ్ముల

By iQlikMovies - June 13, 2018 - 18:38 PM IST

మరిన్ని వార్తలు

గతేడాది 'ఫిదా' సినిమాతో అంతవరకూ ఫ్లాఫుల్లో ఉన్న మెగా హీరో వరుణ్‌తేజ్‌కి దిమ్మ తిరిగే హిట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. చాలా మామూలుగా ప్రారంభమైన ఈ సినిమా అంతటి ఘన విజయం సాధిస్తుందనీ అస్సలెవ్వరూ ఊహించలేదు. అంతేకాదు, సాయిపల్లవి వంటి హైబ్రీడ్‌ సింగిల్‌ పీస్‌ హీరోయిన్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా శేఖర్‌ కమ్ముల ఖాతాలో పడింది. 

ఇక 'ఫిదా' తర్వాత శేఖర్‌ కమ్ముల నుండి మరో మంచి సినిమా రాబోతోందంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 'ఫిదా' ఇచ్చిన కిక్‌కి శేఖర్‌ కమ్ముల ఈ సారి స్టార్‌ హీరోకి గాలమేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరో అని సమాచారమ్‌. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటి? అనే విషయాలు త్వరలోనే తెలియచేయనున్నాడట శేఖర్‌ కమ్ముల. అయితే అంతవరకూ ఆగేలా లేరు ఫ్యాన్స్‌. ఆ హీరో ఎవరనే విషయంపై గెస్‌ మొదలెట్టేశారు. 

ప్రస్తుతం మెగా కాంపౌండ్‌ విషయానికి వస్తే, తేజునా? అంటే, తేజు ప్రస్తుతం 'తేజ్‌ ఐలవ్‌యూ' సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత కిషోర్‌ తిరుమల సినిమా కోసం రెడీ అవుతాడు. వరుణ్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. చరణ్‌ ఫుల్‌ బిజీ. ఇకపోతే 'నా పేరు సూర్య'తో నిరాశపరిచి ప్రస్తుతం ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు బన్నీ. ఒకవేళ ఆ స్టార్‌ హీరో బన్నీనా అని ఫ్యాన్స్‌ హింట్స్‌ మొదలెట్టేశారు. అయితే హింట్‌ ఇవ్వాల్సింది శేఖర్‌ కమ్ముల కదా. ప్రస్తుతం స్క్రిప్టు ప్రిపరేషన్‌ పక్కాగా పూర్తయిందట. ఇక కాస్టింగ్‌ సంగతే తేలాల్సి ఉందట. 

చూడాలి ఈ సారి శేఖర్‌ కమ్ముల నుండి రాబోయే ఆ హిట్‌ సినిమా ఏంటో.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS