సాహో కొత్త పోస్టర్: కాపీనా ? సెంటిమెంటా?

By iQlikMovies - July 23, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న మరో బాహుబలి లాంటి సినిమా 'సాహో'. దాదాపు మూడేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఒకొక్క లుక్కు బయటికి వస్తుంది. తాజాగా మరో కొత్త లుక్కు వదిలారు. ఇందులో శ్రద్ధ.. ప్రభాస్‌ మధ్య ఓ టైట్ క్లోజప్ చూపించారు. ఇప్పటివరకూ వచ్చిన లుక్స్ కు ఇది భిన్నంగా, రొమాంటిక్ గా వుంది. ఐతే ఈ లుక్ బాహుబలి 2 లో అనుష్క ప్రభాస్ లని గుర్తుకు తెచ్చింది.

 

అచ్చం ఇదే టైట్ క్లోజప్ లో అనుష్క ప్రభాస్ ఒకరిని ఒకరు చూసుకునే లుక్ పాపులర్. ఇప్పుడు సాహో కొత్త లుక్ కూడా అచ్చం అదే లుక్ ని తలపించింది. ఇది తెలిసి జరిగిందా ? లేదా యాదృర్చికమో కానీ అచ్చు బాహుబలి దేవసేననే గుర్తుకు తెచ్చింది. అన్నట్టు.. సినిమా వాళ్లకు సెంటిమెట్లు ఎక్కువ. బహుశా సెంటిమెంట్ కలిసొస్తుందని బాహుబలి సిగ్నేచర్ పోస్టర్ ని వాడేశారేమో. ఏదేమైనా ఈ కొత్త లుక్ మాత్రం రొమాంటిక్ సాహోని పరిచయం చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS