డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది స్టార్టింగ్‌లో 'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'సాహో'తో యంగ్ డైరెక్టర్ సుజిత్ స్టార్ డైరెక్టర్ హోదా అందుకున్నాడు. కానీ, సినిమాని సక్సెస్ చేయడంలో తడబడ్డాడు. మరికొందరు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా తమ సత్తా చాటారు. క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్'తో ఇస్మార్ట్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే, చిరంజీవిని ఆ పాత్రలో చూపించాలనుకోవడం సురేందర్ రెడ్డికి నిజంగా సాహసమే. నిర్మాతగా తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్‌ని నెరవేర్చాలనుకోవడం కొడుకుగా రామ్‌చరణ్ తాపత్రయం అటుంచితే, డైరెక్టర్‌గా ఆ హిస్టారికల్ స్టోరీని ఓన్ చేసుకుని తనదైన శైలిలో తెరకెక్కించాడు.
ఈ సినిమా టైంలో సురేందర్ రెడ్డిపై చాలా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. కథని డీల్ చేయలేక సురేందర్ రెడ్డి సినిమా నుండి తప్పుకున్నాడనీ, సినిమాని సరిగ్గా కేర్ చేయడం లేదనే విమర్శలు నిర్మాణం టైంలో ఎదుర్కొన్నాడు. కానీ, అవేమీ పట్టించుకోకుండా, తన ఫుల్ ఫోకస్ కథ పైనే పెట్టాడు. సక్సెస్ కొట్టాడు. ఆయన హార్డ్ వర్క్ అంతా విజువల్స్‌లో, క్యారెక్టర్స్ గెటప్స్‌లోనూ సుస్పష్టంగా కనిపించింది. అయితే, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల బాలీవుడ్ సహా, ఇతర భాషల్లో 'సైరా' ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. కానీ, ఓన్లీ తెలుగు స్టేట్స్‌లోనే 100 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా 'సైరా' రికార్డులకెక్కింది. ఈ క్రెడిట్‌లో దర్శకుడిగా సురేందర్ రెడ్డి పాత్రే ఎక్కువ అనడం అతిశయోక్తి కాదు. అందుకే 2019కి స్పెషల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి పేరు మొదటి ప్లేస్‌లో నిలుస్తుంది.