సునీల్‌పై ఆ గాసిప్‌ నిజం కాదు.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌కి మేజర్‌ యాక్సిడెంట్‌ అయ్యిందనీ, ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సునీల్‌ మృతి చెందారంటూ ఓ వెబ్‌సైట్‌లో న్యూస్‌ వచ్చింది. ఆ న్యూస్‌ విని సునీల్‌ అభిమానులు ఆందోళన చెందారు. దాంతో సునీల్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. 'నేను క్షేమంగానే ఉన్నా.. నాకేమీ జరగలేదు.. అభిమానులు కలత చెందొద్దు. ఆ న్యూస్‌ ఫేక్‌ న్యూస్‌. వాటిని నమ్మొద్దు..' అనీ ట్వీట్‌ చేశారు.

 

దాంతో సునీల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇలా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న వెబ్‌ ఛానెల్స్‌ని ఊరికే వదిలేయరాదనీ, వ్యూస్‌ కోసం మరీ ఇంత దిగజారిపోయే సదరు వెబ్‌ ఛానెల్స్‌ని కఠినంగా శిక్షించాలనీ అభిమానులు సునీల్‌ని కోరారు. గతంలో పలు సంఘటనలపై ఇలాంటి వార్తలను సర్క్యులేట్‌ చేశాయి కొన్ని వెబ్‌ ఛానెళ్లు. అలాంటి వెబ్‌ ఛానెళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలనీ అభిమానులు సునీల్‌కి సూచించారు.

 

ప్రస్తుతం సునీల్‌ సపోర్టింగ్‌ రోల్స్‌తో బిజీగా ఉన్నారు. 'సిల్లీ ఫెలోస్‌' సినిమాతో అల్లరి నరేష్‌తో కలిసి సపోర్టింగ్‌ రోల్స్‌కి సై అన్న సునీల్‌ ఆ తర్వాత చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం పలు బిగ్‌ ప్రాజెక్టులు సునీల్‌ చేతిలో ఉన్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS