'సాహో' చాప్టర్స్‌ మొదలయ్యాయ్‌ బాస్‌.!

By iQlikMovies - October 22, 2018 - 18:25 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమా తర్వాత ప్రబాస్‌ నుండి అదే స్థాయి భారీ బడ్జెట్‌తో వస్తోన్న మూవీ 'సాహో'. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈ లోగా ఫ్యాన్స్‌ కోసం 'సాహో'కి సంబంధించి చిత్ర యూనిట్‌ ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ముందుగానే మొదలెట్టేసింది. 

అందులో భాగంగానే రేపటి నుండి అనగా అక్టోబర్‌ 23 నుండి 'సాహో' సినిమాకి సంబంధించి అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా బయటికి రానున్నాయట. ఆ ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తూ 'సాహో' నుండి ప్రబాస్‌ స్టిల్‌ ఒకటి రిలీజ్‌ చేశారు. సస్పెన్స్‌తో కూడిన ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తూ రిలీజ్‌ చేసిన ఈ స్టిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అసలింతకీ, సినిమా గురించి చిత్ర యూనిట్‌ చెప్పబోయే ఆ అప్‌డేట్స్‌ ఏమై ఉంటాయా అంటూ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. 

'బాహుబలి' సినిమా తర్వాత ప్రబాస్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమూ కోసం బాలీవుడ్‌లో ఎంతో బిజీగా ఉండే శ్రద్ధాకపూర్‌ తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కాగా దుబాయ్‌, యూరప్‌. అమెరికా తదితర ప్రదేశాల్లోని కాస్ట్‌లీ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్ని అందించిన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. 

మరోవైపు ప్రబాస్‌ 'జిల్‌' ఫేం రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్దే ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS