బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో మన తెలుగు రచయత-దర్శకుడైన విజయేంద్రప్రసాద్ ఒక సినిమా తీయబోతున్నాడు అన్న వార్త ఈ మధ్యకాలంలో చర్చనీయంశంగా మారింది. అయితే దీని పైన సరైన సమాచారం ఎవ్వరికీ లేకపోవడంతో అందరు ఈ వార్త పైన ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఈ తరుణంలో విజయేంద్రప్రసాద్ ఈ వార్తకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అదేంటంటే తాను ఎటువంటి కథను బాలీవుడ్ హీరోకి చెప్పలేదు అని అలాగే షారుక్ ఖాన్ తో తాను ఏ చిత్రంలోనూ పనిచేయడం లేదు అని చెప్పాడు.
ప్రస్తుతం ఆయన కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహ్సితున్న ‘మణికర్ణిక’ చిత్రం పనులతో బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇక ఆయన దర్శకత్వంలో ఇప్పట్లో ఏ చిత్రం రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన పలు బాషలలో పెద్ద పెద్ద హీరోల చిత్రాలకి కథలు అందిస్తున్నారు.
దీనితో విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ ఎంట్రీ లో నిజం లేదు అని తేలిపోయింది.