2017లో 'శమంతకమణి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుధీర్ బాబు. తొలి సినిమా 'ఎస్సెమ్మెస్' నుండీ డిఫరెంట్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. నటుడిగా 'శమంతకమణి'లో కొత్తగా కనిపించాడు. ఈ కొత్త సంవత్సరం 2018లో సుధీర్ బాబు చాలా బిజీ కానున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వాటిలో నేషనల్ అవార్డు గ్రహీతలైన ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ఓ సినిమాలో నటిస్తున్నాడు సుధీర్ బాబు. మరో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమాలోనూ నటిస్తున్నాడు.
ఇటీవలే ప్రవీణ్ సత్తారు 'గరుడవేగ' సినిమాతో మంచి హిట్ కొట్టి జోరు మీదున్నాడు. సుధీర్ బాబుతో చేయబోయే సినిమా కోసం రెడీగా ఉన్నాడిప్పుడు. ఇక సుధీర్ బాబు చేయబోయే మరో రెండు సినిమాలు కొత్త దర్శకులతో ఉండబోతున్నాయి. ఇంద్రసేన అనే కొత్త డైరెక్టర్‌తో సరికొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. ఇక నాలుగోది ఆర్. ఎస్ నాయుడు. ఈయన కూడా ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కానున్నారు. నటుడిగా ఈ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు సుధీర్ బాబు. తన నిర్మాణంలో ఓ కొత్త బ్యానర్‌ని ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేస్తాననీ సుధీర్‌బాబు చెప్పాడు.
త్వరలోనే సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నాడు. నటనలో విలక్షణ చూపిస్తూ ఉంటాడు సుధీర్‌బాబు. కేవలం హీరోనే కాదు, విలన్‌గానూ మెప్పించాడు. అలాగే డాన్సులు, బాడీ బిల్డింగ్ ఇలా తదితర అంశాల్లో తన టాలెంట్ ప్రదర్శించాడు సుధీర్ బాబు. నటనలో తొలి సినిమాకీ ఇప్పటికీ చాలా ఆరితేరాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతూంటాడు. చూడాలి ఈ ఏడాది సుధీర్ బాబు నటుడిగా, నిర్మాతగా ఇంకెన్ని సక్సెస్‌లు అందుకుంటాడో!