నాని నటించిన క్లాస్ మూవీ 'జెర్సీ' హిందీలో భారీ స్థాయిలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ రీమేక్ లో హీరోగా అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ కి హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. కాగా తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 10వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చండీగఢ్ లో మొదలుకానుంది. చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. ముఖ్యంగా లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ అన్ని అక్కడే షూట్ చేస్తున్నారు.
ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం 'అర్జున్ రెడ్డి'ని హిందీలోకి 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. కాగా ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. మరి ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు. 2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట.