'అమీర్' సినిమాలో 'విజయ్'ది ఇంట్రస్టింగ్ రోల్ !

మరిన్ని వార్తలు

బాలీవుడ్ స్టార్స్ లో ముఖ్యంగా ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్ అభిరుచే వేరు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీ హిట్స్ అందుకోవడం అమీర్ ఖాన్ కి ఎప్పటినుండో వస్తోన్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా వచ్చినవే '3 ఇడియట్స్, పీకే, దంగల్' లాంటి చిత్రాలు. కాగా తాజాగా అమీర్ చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం 'సిడ్ లాలా సింగ్ చడ్డా'. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఫీజికల్లీ అదేవిధంగా మెంటల్లీ పాక్షికమైన లోపాలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. అలాగే సైనికుడిగాను చేస్తున్నారు.

 

ఈ మూవీ 1994లో టామ్ హంక్స్ హీరోగా వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమాకి ప్రేరణ అని తెలుస్తోంది. ఆ సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొనే ఈ సినిమా కథాకథనాలు రాసుకున్నారట. కాగా ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ విశేష స్పందన దక్కించుకుంది. అయితే ఈ మూవీలో వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఓ కీలకమైన రోల్ నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తోన్నట్లు.. తమిళ్ నాడుకి చెందిన ఓ సైనికుడి పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 

అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావ్, వియాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రయోగం కూడా అమీర్ ఖాన్ కి భారీ హిట్ ఇస్తోందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS