సౌత్ క‌థ‌ల్ని వ‌ద‌ల‌వా షాహిద్‌...?

By Gowthami - June 18, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

సౌత్ ఇండియా క‌థ‌ల‌పై మ‌న‌సు పారేసుకుంటున్నాడు షాహిద్ క‌పూర్‌. తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన‌.. `అర్జున్ రెడ్డి`ని బాలీవుడ్ లో రీమేక్ చేసి విజ‌యం అందుకున్నాడు షాహిద్‌. ఇప్పుడు `జెర్సీ`ని సైతం అక్క‌డ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈలోగా మ‌రో సౌత్ ఇండియ‌న్ సినిమాపై మ‌న‌సు పారేసుకున్నాడ‌ని టాక్‌. అదే.... `ఆకాశం నీ హ‌ద్దురా`.

 

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈలోగా ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని షాహిద్ క‌పూర్ సొంతం చేసుకున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికీ సుధా కొంగ‌రే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెప్పుకుంటున్నారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని టాక్‌. తెలుగులోనూ ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS