యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు ఈనెల విడుదలకావాల్సి ఉండగా కేరళ వరదలతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకి ఆటంకం వచ్చిపడింది.
అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం, శైలజారెడ్డి అల్లుడు చిత్రం వచ్చే నెల 13వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీని పైన అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికి ఇండస్ట్రీ వర్గాల నుండి మాత్రం సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసేస్తున్నారట.
ఇక ఈ చిత్ర విజయం చైతుకి చాలా అవసరం అని చెప్పాలి. కారణం- ఆయన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంతగా సక్సెస్ అవ్వలేకపోయాయి. దర్శకుడు మారుతి కూడా ఈ చిత్రాన్ని చాల జాగ్రత్తగా తీసాడట, ఆయన గత చిత్రం బాబు బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది.
మొత్తానికి ఈ చిత్రం హిట్ అవ్వడం ఈ ఇద్దరికి చాలా అవసరం అని అర్ధమవుతుంది.