అక్కకి నచ్చిన గీత గోవిందం సినిమా

మరిన్ని వార్తలు

తెలంగాణ జాగృతి గౌరవ అధ్యక్షురాలిగా ప్రజల్లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి ఆ తరువాత కాలక్రమంలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆమె ప్రస్థానం తెలిసిన, చూసినవారు గాని ఆమెని ప్రేమగా ‘అక్క’ అని పిలుచుకుంటుంటారు.  

ఇక తాజాగా ఆమె ఈమధ్యనే విడుదలైన గీత గోవిందం చిత్రం చూడడం జరిగింది. ఆ చిత్రం బాగా నచ్చడంతో వెంటనే గీత గోవిందం చిత్రానికి సంబంధించిన హీరో విజయ్, నిర్మాత బన్ని వాసు, రచయిత-దర్శకుడు పరశురామ్ లని కలిసి వారి కృషికి అభినందనలు తెలిపారు.

ఈ భేటీలో తనకి చిత్రం ఎంతలా నచ్చిందో ఆమె వారికి వివరించడమే గాక ఇటువంటి మంచి చిత్రాలని మరిన్ని తీయాలని కోరినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వరద పారిస్తున్న ఈ చిత్రానికి ఇటువంటి ప్రముఖుల ప్రశంసలు కూడా ప్లస్ అవుతున్నాయి.

ఇక ఈ చిత్రం 2018 లో ఘన విజయం సాధించిన చిత్రాల సరసన చేరిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS