చిరంజీవికి సునీల్‌, పవన్‌కి శంకర్‌

మరిన్ని వార్తలు

చిరంజీవికి సినీ రంగంలో చాలామంది అభిమానులే వున్నారు. వారిలో చిరంజీవిని చాలా మంది ఇమిటేట్‌ చేస్తుంటారు కూడా. అయినాగానీ, సునీల్‌ వేసే డాన్సులు అచ్చంగా మెగాస్టార్‌ని తలపిస్తాయి. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ని అచ్చంగా దించేస్తున్నాడు షకలక శంకర్‌. కమెడియన్‌గా బుల్లితెర షో జబర్‌దస్త్‌తో పాపులర్‌ అయిన షకలక శంకర్‌ 'శంభో శంకర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. ట్రైలర్‌లో అచ్చంగా పవన్‌కళ్యాణ్‌ని దించేసేందుకు షకలక శంకర్‌ ప్రయత్నించాడు. పవన్‌కళ్యాణ్‌ - శ్రీరెడ్డి - రామ్‌గోపాల్‌ వర్మ వివాదానికి సంబంధించి పవన్‌కళ్యాణ్‌కి పూర్తి మద్దతుగా నిలిచిన షకలక శంకర్‌, పవన్‌కళ్యాణ్‌ కోసం ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొన్న సంగతి తెల్సిందే. అలా పవన్‌కళ్యాణ్‌ మీద తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు ఈ కమెడియన్‌. 

సినిమాలో కేవలం ఇమిటేషన్‌తో సరిపెడతాడా.? పవన్‌కళ్యాణ్‌ ప్రత్యర్థులకు ఆయన అభిమానిగా షకలక శంకర్‌ కౌంటర్స్‌ కూడా ఇస్తాడా? అనేది చర్చనీయాంశంగా మారింది సినీ పరిశ్రమలో. ఇదిలా వుంటే, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మని ఇమిటేట్‌ చేయడంలోనూ షకలక శంకర్‌కి మంచి గుర్తింపు వుంది. వర్మని అచ్చంగా దించేయడంలో షకలక శంకర్‌ని ది బెస్ట్‌గా చెప్పుకోవాల్సి వుంటుంది. వర్మ సమక్షంలోనే వర్మలా షకలక శంకర్‌ ఇమిటేట్‌ చేసి సెబాష్‌ అన్పించుకున్నాడు. 

ఏదేమైనా చిరంజీవికి సునీల్‌, పవన్‌కి షకలక శంకర్‌ అనే షకలు మాత్రం 'శంబో శంకర' టీజర్‌తో కన్పిస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS