జబర్‌దస్త్ అనే కామెడీ షోతో కమెడియన్‌గా పాపులరైన వారిలో షకలక శంకర్ పేరు కూడా ఉంటుంది. ఈటీవీ 'జబర్దస్ట్' ప్రోగ్రాం ద్వారా బాగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. మంచి టైమింగ్ ఉన్న కామెడీ పాత్రలకి పెట్టింది పేరు షకలక శంకర్. పవన్‌కళ్యాణ్‌ని దేవుడిగా భావించే షకలక శంకర్‌కి, పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ సినిమాలో అతని పాత్ర ఆకట్టుకుంటుంది కూడా. అయితే 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా టైమ్‌లో అతన్ని పవన్ కొట్టాడనే విమర్శలు చేశాడని గాసిప్స్ వచ్చాయి. ఈ గాసిప్స్‌పై షకలక శంకర్ చాలాకాలంగా మౌనమే దాల్చాడు. తాజాగా ఆ ఘటనపై స్పందించిన షకలక శంకర్, అదంతా ఉత్తదేనని చెప్పాడు. ఆయన ఎలాంటోడో అందరికీ తెలుసు, ఆయనెందుకు తనను కొడతాడని ప్రశ్నించాడు శంకర్. పవన్ అంటే ఎంతో అభిమానం ఉన్న షకలక శంకర్, పవన్‌కళ్యాణ్ ఎప్పటికీ తనకు దేవుడేన్నాడు. ఎప్పటికీ అతనిపై భక్తి తగ్గదన్నాడు. చాలా కామెడీ స్కిట్స్‌లో పవన్‌కళ్యాణ్‌కి భక్తుడిలా నటించి మెప్పించాడు. వర్మని ఇమిటేట్ చేయడంలో షకలక శంకర్ దిట్టగా చెప్పవచ్చు. బుల్లితెర నుంచి సినిమాల్లోకి ప్రమోట్ అయిన ఈ కమెడియన్ వరుసగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై వెలిగిపోతున్నాడు. చిన్న చిన్న గాసిప్స్‌ని పట్టించుకుంటూ పోతే కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయని అయినప్పటికీ కూడా తన దేవుడి మీద తన మీద ఆరోపణలు రావడంతో స్పందించవలసి వస్తోందని అన్నాడు షకలక శంకర్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఏ చిన్న క్యారెక్టర్ చేసినా తమ లాంటి వాళ్లకి భాగ్యమే అంటున్నాడీ కమెడియన్.