సౌత్ ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు షకీలా. అడల్ట్ సినిమాలలో నటిస్తూ ఓ ఊపు ఊపేసిన షకీలా ఓ దశలో మలయాళం స్టార్ హీరోల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి అందరిని షాక్ కు గురిచేసిందని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక షకీలా నటించిన సినిమాలకు 'ఎ' సర్టిఫికేట్ రావడమనేది సాధారణం. అయితే తాజాగా షకీలా నటించిన ఓ సినిమాకు క్లీన్ యూ రావడంతో ఒక్కసారిగా అందరూ సర్ ప్రైజ్ అయ్యారు.
షకీలా తాజా చిత్రానికి 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈసినిమాకు రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. సిబీఎఫ్ సి వారు ఒక డైలాగును మ్యూట్ చెయ్యమని చెప్పి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారట. ఈ విషయం తెలిసిన వారు చాలామంది అవాక్కవుతున్నారు. అయితే సినిమాలో అడల్ట్ కంటెంట్ లేకపోవడం వల్లే ఇలా క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో విక్రాంత్, పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిరామ్ దాసరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓటీటీ రిలీజ్ కు పోవాలా అనే విషయంలో నిర్మాతలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందట.