గొంతు సవరించుకున్న ప్రముఖ నటి

మరిన్ని వార్తలు

షాలిని పాండే అంటే ఎవరికి తెలియకపోవచ్చు కాని ప్రీతి అంటే మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. దీనికి కారణం అర్జున్ రెడ్డి చిత్రంలో అర్జున్ రెడ్డి ప్రేయసి పాత్రలో ఆమె పండించిన అద్బుత అభినయమే దీనికి కారణం. 

ఇక ఇప్పుడు ఈమె నటిగానే కాకుండా ఒక గాయనిగా కూడా ప్రేక్షకుల ముందుకి రానున్నది. ఆ వివరాల్లోకి వెళితే, పాప్ రాక్ బ్యాండ్ అయిన ‘లగోరీ’ కంపోజ్ చేసిన ‘నా ప్రాణమే’ అంటూ సాగే ఒక ప్రేమ గీతాన్ని షాలిని ఆలపించింది. ప్రస్తుతం ఈ పాటకి సంబందించిన టీజర్ ఒకటి విడుదలైంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్ తో అందరు ఆమెకి ఫిదా అవుతున్నారు. ఇక 14వ తేదీన విడుదలయ్యే పూర్తి పాటతో ప్రేక్షకులు ఇంకేమవుతారో అన్నది చూడాలి. మొత్తానికి షాలిని పాండే నటిగానే కాకుండా గాయనిగా కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నది. 

ఇదిలావుండగా ఆమె ప్రస్తుతం తమిళంలో 100% కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS