ఎంతైనా అక్కడున్నది పవన్‌కళ్యాణ్ కదా. ఆయన హీరోగా వస్తున్న 'కాటమరాయుడు' సినిమాపై భారీ అంచనాలుండడంతో, ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇతర సినిమాలు పోటీ పడుతున్నాయి. తమ ట్రైలర్లను 'కాటమరాయుడు' థియేటర్లలో ప్రదర్శించేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు పోటీపడ్డారు. వరుణ్ తేజ హీరోగా నటించిన 'మిస్టర్', నిఖిల్ హీరోగా నటించిన 'కేశవ', కార్తీ హీరోగా నటించిన 'చెలియా', వెంకటేష్ నటించిన 'గురు' సినిమాల ట్రైలర్లు 'కాటమరాయుడు' థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. ఇన్ని సినిమాల ట్రైలర్లు ఒకే సినిమాతో అటాచ్ అవడం గొప్ప విషయమని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇందులో వరుణ్ తేజ, స్వయానా పవన్‌కళ్యాణ్‌కి అన్నయ్య కొడుకే. నిఖిల్, ఎలాగూ పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని. పవన్‌కళ్యాణ్‌కీ, వెంకటేష్‌కీ ఎప్పటినుంచో మంచి స్నేహం ఉంది. కార్తీ అందరివాడూ. ఇన్ని సినిమాలకి 'కాటమరాయుడు' ఏ రేంజ్ కిక్ ఇస్తాడో చూడాలిక. మూడు రోజుల్లోనే 'కాటమరాయుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకోగా, మరో పక్క ఇలా పలు చిత్రాలు తమ ప్రమోషన్ కోసం 'కాటమరాయుడు' సినిమాని ఓ వేదికగా మార్చుకుంటున్నాయి. మరో పక్క ఆగలేని ఉత్సాహంతో అభిమానులు 'కాటమరాయుడు' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.