శంకర్ అనగానే భారీ సినిమాలూ, సరికొత్త ఆలోచనలు గుర్తొస్తాయి. అయితే తాను చేసినవన్నీ తమిళ సినిమాలే. తెలుగులో శంకర్ నేరుగా ఓసినిమా చేస్తే చూడాలనుకున్నారు మన వాళ్లు. కానీ శంకర్ దృష్టంతా తమిళ హీరోలపైనే ఉండేది. ఇప్పుడు సడన్ గా.. శంకర్ దృష్టి మన టాలీవుడ్ హీరోలపై పడింది. అందులోనూ మెగా హీరోలతో సినిమా చేయాలని భారీ స్కెచ్ తయారు చేస్తున్నాడట. శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ - రామ్ చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ రాబోతోందని ఈమధ్య ప్రచారం జోరుగా సాగుతోంది.
దీనికి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాక్. మరో ట్విస్టు ఏమిటంటే.. ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. అలా చిరు- పవన్ -చరణ్‌లను ఒకే ఫ్రేమలోకి తీసుకొచ్చే ఆలోచనలలో శంకర్ ఉన్నాడని టాక్. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చిరు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కల ఇలా తీరబోతోందన్నమాట.
మొత్తంగా చూస్తుంటే.. అక్కినేని `మనం`లా మెగా `మనం` తయారైపోతోందన్నమాట. ఇంకేందెకు బన్నీ, సాయిధరమ్, వైష్ణవ్, వరుణ్‌లను తీసుకొచ్చేస్తే.. వాళ్లకేదో ఓ పాత్ర ఇచ్చేస్తే.. ఇది మెగా మనం అయిపోతుందిగా? మరి శంకర్ స్కెచ్చేమిటో?