సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన బొమ్మకు మురళి

మరిన్ని వార్తలు

ఉన్నత చదువులు చదివి , విదేశాల్లో ఉద్యోగం చేసి ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై సమారశంఖం పూరించి సమసమాజ నిర్మాణం కోసం పిడికిలి బిగించిన వ్యక్తి , శక్తి బొమ్మకు మురళి . సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపాలనే సదుద్దేశ్యం తో అణగారిన వర్గాల  ఉజ్వల భావి భారతావని కోసం రిజర్వేషన్ లను అందించారు రాజ్యాంగ నిపుణులు . కానీ సదుద్దేశ్యం తో నెలకొల్పిన రిజర్వేషన్ లు అమలుకాక పోవడంతో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి , జనాలను మరింత చైతన్యవంతం చేయడానికి సినిమా రంగం పవర్ ఫుల్ కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాడు బొమ్మకు  మురళి . ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన శరణం గచ్చామి చిత్రం నిన్న రిలీజ్ అయి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . ఆ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు.

బోడుప్పల్ లో దాదాపు 200 కార్యక్రమాలకు పైగా చేసి ప్రజల తలలో నాలుకలా వ్యవహరించానని అయితే భారత రాజ్యాంగం ఇచ్చిన స్పూర్తిని రాజకీయ నాయకులు దెబ్బ తీస్తున్డటం తో ఆ దిశగా నేనేమి చేయగలనని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో సినిమానే పవర్ ఫుల్ మీడియా కాబట్టి ఈ రంగంలోకి రావడం జరిగింది.

కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే అది ఒక్కసారిగా జరిగే వ్యవహారం కాబట్టి ముందుగా రాజ్యాంగ స్పూర్తి దెబ్బతినకుండా రాజ్యాంగం కలిపించిన హక్కులు అణగారిన వర్గాలకు అందాలనే లక్ష్యంతోనే ఈ శరణం గచ్చామి చిత్రం నిర్మించాను , రిజర్వేషన్ ల ప్రక్రియ సక్రమంగా అమలు జరిగితే ....... సమసమాజ నిర్మాణం జరిగితేనే కులాల వ్యవస్థ పోతుందని లేదంటే ఈ జాడ్యం మరింతగా ఎక్కువ అవడమే కాకుండా ఒకరినొకరు దోచుకునే సంస్కృతి ఎక్కువ అవుతుంది. 

ఇక సినిమా రిలీజ్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని , సెన్సార్ ఆఫీసర్ మూర్ఖత్వం వల్ల కేంద్ర సెన్సార్ బోర్డ్ కి వెళ్ళాల్సి వచ్చింది . మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి రెండు తెలుగు రాష్ట్రాలలో 85 థియేటర్ లలో నిన్న సినిమా రిలీజ్ చేసాం . రిలీజ్ అయిన అన్ని చోట్ల నుండి రెస్పాన్స్ బాగా వస్తోంది . అందుకే ఈరోజు మరో 20 థియేటర్ లు పెరిగాయి. 

నా తదుపరి చిత్రం ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే కాన్సెప్ట్ తో తీయబోతున్నాను, దానికి కూడా కథ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా నేనే వహిస్తానని అన్నాడు బొమ్మకు మురళి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS