శర్వానంద్ కీ - 14 రీల్స్ నిర్మాణ సంస్థకు మధ్య విబేధాలు రావడం, 14 రీల్స్ కి శర్వా లీగల్ నోటీసులు పంపడం... పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. 14 రీల్స్ నిర్మించిన `శ్రీకారం`లో శర్వా కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శర్వాకి 6 కోట్ల పారితోషికం ఇస్తామని 14 రీల్స్ ఒప్పందం చేసుకుంది. చివరికి 2 కోట్ల పారితోషికం ఎగ్గొట్టింది. ఈ విషయమై నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు పంపాడు. 14 రీల్స్ నిర్మాతల వెర్షన్ ప్రకారం... శ్రీకారం చిత్రానికి భారీ నష్టాలొచ్చాయి.
ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో బయ్యర్లు.. నిర్మాతలకు ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టారు. దాంతో.. 14 రీల్స్ తీవ్రంగానష్టపోయింది. అందుకే శర్వాకి 2 కోట్లు ఇవ్వలేకపోయారు. అయితే.. శర్వా వర్గం చెబుతున్న వెర్షన్ మరోలా ఉంది. శ్రీకారం సినిమాని విడుదలకు ముందే మంచి రేట్లకు అమ్మేశారు. టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా విడుదలైంది. అయినా సరే, శర్వా బాకీ ఎగ్గొట్టారు. ఇదీ... టాలీవుడ్ లో వినిపిస్తున్న రెండు మాటలు. మరి.. ఇందులో నిజానిజాలేంటో వాళ్లకే తెలియాలి.