వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. అయితే... వెంకటేష్ ఇప్పుడు ప్రత్యేకంగా ఓటీటీ కోసమే ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పక్కా అయ్యింది కూడా. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తారు.
`కేరాఫ్ కంచరపాలెం` చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. ఆ తరవాత.. `ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య`కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు వెంకీతో ఓ ప్రాజెక్టు ఓకే అయ్యింది. దీన్ని అమేజాన్ నిర్మించబోతోంది. ఈ సినిమా కేవలం అమేజాన్ కోసమే. వెంకటేష్ చేతిలో `ఎఫ్ 3` సినిమా ఉంది. `దృశ్యమ్ 2` కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ రెండు సినిమాల తరవాతే... వెంకటేష్ మహా సినిమా పట్టాలెక్కుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.