ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా హీరోగా శర్వానంద్‌కుంది. పేరుకి యంగ్ హీరోనే అయినా కానీ, బరువైన పాత్రల్లోనూ నటించి మెప్పించగలడు. 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' సినిమా తీసుకుంటే, ఆ సినిమాలో పదహారు, పదిహేడేళ్ల టీనేజ్ అమ్మాయికి తండ్రిలా కనిపించాడు. అంత ఏజ్డ్ క్యారెక్టర్‌లో ఏమాత్రం వెలితి కనబడకుండా, కరెక్ట్‌గా సెట్ ఆయిపోయాడు శర్వానంద్. అదే శర్వానంద్‌లోని స్పెషాలిటీ. ఎట్ ది సేమ్ టైమ్, 25 ఏళ్ల కుర్రోడిలానూ సెట్ అయిపోతాడు.
కెరీర్ తొలి నాళ్లలో విభిన్న తరహా పాత్రల్లో నటించి, విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. కానీ అప్పటికి హీరోగా ఇంకా టర్న్ కాలేదు. 'అమ్మ చెప్పింది' సినిమాలో శర్వా పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే 'ప్రస్థానం' సినిమాలోనూ శర్వానంద్ వయసుకు మించిన పాత్రలో కనిపించాడు. అవన్నీ శర్వానంద్‌ని విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. అయితే 'రన్ రాజా రన్' సినిమా నుండి కామెడీ ట్రాక్ ఎక్కేశాడు. హీరోగా వరుస సక్సెస్‌లకు ఇక్కడి నుండే బీజం పడింది శర్వానంద్‌కి. 'రన్ రాజా రన్' మొదలుకొని, నిన్నటి 'మహానుభావుడు' వరకూ శర్వానంద్ వరుస హిట్స్‌తో శర్వా పరుగులకు బ్రేకులే పడలేదు.
తాజాగా శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. వాటిలో ఓ పాత్ర కోసం శర్వా నలభై ఏళ్ల వయసున్న పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారమ్. అంతేకాదు, ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయంటున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ కనిపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అలాగే మరో పాత్రలో పాతికేళ్ల కుర్రాడిలా కనపిస్తాడట శర్వానంద్. ఈ సినిమా వచ్చే నెల్లో సెట్స్ మీదికెళ్లనుంది.