పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అమెరికాలో అయితే ఈ చిత్రం విడుదలైన స్థాయి ఈమధ్యకాలంలో వేరే ఏ ఇతర చిత్రానికి లేదు. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం మొదటిరోజు 1.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ 9.6 కోట్ల మేర వసూళ్ళు సాధించి బాహుబలి పార్ట్ 1 కలెక్షన్స్ ని తిరగరాసింది.
ఇక మన తెలుగు రాష్ట్రాల సంగతి చూసుకుంటే తెలంగాణలో సుమారు రూ 9కోట్ల (గ్రాసు) రూ 6 కోట్ల (షేర్) వరకు కొల్లగొట్టగా ఆంధ్రప్రదేశ్ లో రూ 29 కోట్ల (గ్రాస్) రూ 20కోట్ల (షేర్) తో దాదాపు బాహుబలేతర రికార్డులన్నీ అజ్ఞాతవాసి చెరిపేసింది అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాని తప్పిస్తే ఇప్పుడు అన్ని రికార్డులు పవన్ కళ్యాణ్ పేరిటనే ఉండడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ ఒకసారి చూస్తే- రూ 60 కోట్ల గ్రాసుని రాబట్టగా రూ 40 కోట్ల షేర్ తో ముగిసింది నిన్నటి బాక్స్ ఆఫీస్. అయితే సినిమాకి నెగటివ్ టాక్ రావడం అలాగే రేపు మరో రెండు చిత్రాలు రావడం ఈ చిత్ర కలెక్షన్స్ పైన ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
చూద్దాం... ఈ పండగ సీజన్ లో అజ్ఞాతవాసి ఎంత వరకు ఆర్జించగలడో అని...