మంచు వారి సినిమాకి మెగా పవర్‌ క్లాప్‌.!

మరిన్ని వార్తలు

మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్‌పై రామ్‌చరణ్‌ క్లాప్‌నిచ్చారు. శ్రీకాంత్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో మంచు మనోజ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇటీవల రిలీజ్‌ చేసిన టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్‌ గెస్ట్‌గా రావడంతో, మెగా సపోర్ట్‌ ముందే దక్కేసింది ఈ సినిమాకి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్‌ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత నటిస్తున్న చిత్రమిది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. టైటిల్‌ చూస్తుంటే, ఈ సినిమాతో ఏదో మ్యాజిక్‌ చేసేలానే ఉన్నాడీ మంచు వారబ్బాయ్‌. ప్యాన్‌ ఇండియా సినిమాగా మనోజ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS