వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. మోస్ట్లీ పండగలకి పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ వసూల్ రాజాగా పాపులర్ అయిపోయాడు ఈ మధ్య శర్వానంద్. గతేడాది 'శతమానం భవతి' సినిమాతో మెగాస్టార్, నందమూరి నటసింహం బాలయ్యల సినిమాలతో పోటీ పడ్డాడు. అలాగే రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ', సూపర్ స్టార్ మహేష్ సినిమా 'స్పైడర్'తోనూ పోటీపడి బరిలో నిలిచాడు. నిలవడమే కాదు 'మహానుభావుడు' సినిమాతో వసూల్ రాజా కాస్త వసూల్ మహానుభావుడయ్యాడు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కింది ఈ సినిమా మెహరీన్ హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడు మన ఫెస్టివల్ రాజా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. వీటిని ఏ పండక్కి దించుతాడో ఇంకా తెలీదు కానీ, బరిలో ఉండేందుకే కాలు దువ్వుతున్నాడనీ తెలియవస్తోంది. 'సామిరారా', దోచేయ్', కేశవ' సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సుధీర్ వర్మతో శర్వానంద్ ఓ సినిమా చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా మరో పక్క హను రాఘవపూడితో మరో సినిమాకీ శర్వానంద్ కమిట్ అయ్యాడు. ఇటీవలే నితిన్‌తో 'లై' సినిమాని తెరకెక్కించాడు హను. ఈ రెండు సినిమాలను ఎట్ ఏ టైమ్, కొంచెం గ్యాప్‌లో పూర్తి చేయనున్నాడట శర్వానంద్. అయితే హను రాఘవపూడి అఖిల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విక్రమ్ కుమార్‌తో 'హలో' సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిల్. సో హనుతో అఖిల్ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా టైం పట్టే అవకాశాలున్నాయి. సో ఈ లోగా శర్వానంద్‌తో సినిమాని పూర్తి చేసే యోచనలో హను ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ని పరిచయం చేసే పనిలో ఉన్నాడట హను. ముద్దుగుమ్మ మెహరీన్‌ని పరిచయం చేసింది కూడా హను రాఘవపూడినే.