చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్టయిపోతే.. ఇక ఆ దర్శకుడ్ని ఏమనాలి? అనిల్ రావిపూడి ఆ ఫీట్ సాధించేశాడు. పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్ 2, సరి లేరు నీకెవ్వరు... ఇలా వరుసగా 5 హిట్టు కొట్టాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి రంగం సిద్ధం చేశాడు. `ఎఫ్ 3` చిత్రీకరణ చివరికొచ్చేసింది. ఆ తరవాత అనిల్ రావిపూడి బాలయ్యతో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే ఇప్పుడు యువ హీరో శర్వానంద్ కి టచ్‌లో వెళ్లాడట అనిల్ రావిపూడి.
శర్వా - అనిల్ రావిపూడి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిజానికి పటాస్ తరవాతే.. శర్వాతో అనిల్ రావిపూడి ఓసినిమా చేయనున్నాడని ప్రచారం సాగింది. అయితే.. ఆ ప్రాజెక్టు కార్యరూపంలోకి రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ లైన్ లోకి వచ్చాడు. బాలయ్య సినిమా తరవాత.. శర్వా సినిమా ఉంటుందా? లేదంటే అంతకంటే ముందు పట్టాలెక్కబోతోందా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి ఈ కాంబో మాత్రం ఖాయం.