శర్వానంద్‌ సినిమా సంగతేంటో!

మరిన్ని వార్తలు

ఫెస్టివల్‌ హీరోగా పాపులర్‌ అయిన శర్వానంద్‌ కెరీర్‌ ఈ మధ్య కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. 'పడి పడి లేచె' అంటూ గతేడాది చివర్లో సందడి చేశాడు శర్వానంద్‌. అయితే శర్వా సందడి ఫలించలేదు. ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించలేదు. అంతకు ముందు వరకూ శర్వానంద్‌ సినిమా అంటే సూపర్‌ హిట్‌ అనే టాక్‌. కానీ 'పడి పడి లేచె..' సినిమాతో శర్వా కొంచెం తడబడ్డట్లున్నాడు. చేయాల్సిన సినిమాలు చేతిలో చాలానే ఉన్నాయి. రెండు, మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి కూడా.

 

కానీ, ఏ సినిమాకి సంబంధించీ ఇన్‌ఫర్మేషన్‌ లేదు. సుధీర్‌ వర్మతో శర్వానంద్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శర్వానంద్‌ డాన్‌ పాత్ర పోషిస్తున్నాడు.. ఈ సినిమాకి సంబంధించి ఇంతే సంగతులు. ఇదిలా ఉంటే, ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేయలేదు. మరోవైపు తమిళ సూపర్‌ హిట్‌ మూవీ '96' రీమేక్‌లో శర్వా నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

 

ఈ సినిమాక సక్సెస్‌ పట్ల శర్వా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి చిత్రీకరిస్తున్నారు. దాదాపు సగానికి పైగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది ఈ సినిమా. సినిమాలైతే ఉన్నాయి కానీ, ఏ అప్‌డేట్స్‌ అందించడం లేదీ ఫెస్టివల్‌ హీరో. ఫెస్టివల్‌ రిలీజ్‌లు శర్వాకి బాగా కలిసొచ్చాయి. ఆ సెంటిమెంట్‌ ఫాలో చేసి, వీటిలో ఏ ఒక్క సినిమాకైనా ముందున్న దసరా రిలీజ్‌ని ప్లాన్‌ చేసుకుంటాడేమో శర్వా చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS