మ‌హేష్ కోస‌మా? విజయ్ కోస‌మా?

మరిన్ని వార్తలు

శేఖర్ క‌మ్ముల స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయ‌న క‌థ‌లు, వాటిని తీసే విధాన‌మే కాదు, హీరోల్ని ఎంచుకునే ప‌ద్ధ‌తి కూడా సెప‌రేటే. స్టార్ హీరోల వెంట ఎప్పుడూ ప‌డ‌లేదు. యంగ్‌, స్ట్ర‌గుల్డ్ హీరోల‌నే ఎంచుకున్నారు. దానికి తోడు ఆయ‌న క‌థ‌ల్లో హీరోయిన్ల డామినేష‌న్ ఎక్కువ‌. అందుకే స్టార్ హీరో ఎప్పుడూ అవ‌స‌రం రాలేదు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆ విష‌యాన్ని అధికారికంగానూ చెప్పేశాడు. అయితే ఆ హీరో ఎవ‌ర్న‌న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఏసియ‌న్ సునీల్ ఈ చిత్రానికి నిర్మాత‌.

 

శేఖ‌ర్ క‌మ్ముల‌తో ప‌నిచేసే ఆ స్టార్ హీరో ఎవ‌రన్న ఆస‌క్తి ఇప్పుడు అంద‌రిలోనూ నెల‌కొంది. ఆ హీరో మ‌హేష్ బాబు అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఎందుకంటే మ‌హేష్ తో ఓ సినిమా చేయ‌డానికి ఇది వ‌ర‌కు శేఖ‌ర్ క‌మ్ముల గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాడు. అప్ప‌ట్లో ఈ కాంబో ఖాయ‌మ‌న్న వార్త‌లొచ్చాయి. కానీ ఎందుకో.. ఆ ప్రాజెక్టు మ‌ళ్లీ వార్త‌ల్లో వినిపించ‌లేదు. ఈసారి మాత్రం ఈ కాంబో ప‌క్కా అని తెలుస్తోంది. పైగా ఏసియ‌న్ సునీల్ తో మ‌హేష్‌కి మంచి సంబంధాలున్నాయి. ఇద్ద‌రూ క‌లిసి మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలో భాగ‌స్వాములు. అందుకే... ఈసారి మాత్రం ఈ కాంబో ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌హేష్‌తో ఓ సిట్టింగ్ వేశాక‌.. ఆయ‌న డేట్లు, ఇత‌ర సినిమా వ్య‌వ‌హారాల విష‌యంలో స్ప‌ష్ట‌మైన స‌మాచారం అందుకున్న త‌ర‌వాత‌.. ఈ కాంబో గురించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

ఒక వేళ మ‌హేష్‌తో అవ‌కాశం మిస్ అయితే మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని రెండో ఆప్షన్ ‌గా ఉంచుకున్నార‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజ‌య్ ఓ చిన్న పాత్ర చేసిన సంగ‌తి తెలిసే ఉంటుంది. సో..మ‌హేష్ కాద‌న్న ప‌క్షంలో ఈ కాంబో అయినా చూసే ఛాన్స్ ద‌క్కుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS