సెక్సీ భామ 'ఇన్నర్‌' బ్యూటీ

మరిన్ని వార్తలు

ఇన్నర్‌ వేర్‌లో తళతళ్లాడిపోతున్న ఈ సొగసుల బ్యూటీ ఇంకెవరో కాదు, షెర్లీన్‌ చోప్రా. మన హైద్రాబాదీనే. తెలుగులో మళ్ళీ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోందట ఈ భామ. త్వరలోనే ఓ తెలుగు సినిమాకి సంబంధించిన డిటెయిల్స్‌ వెల్లడించేందుకు సిద్ధంగా వుంది షెర్లీన్‌ చోప్రా. చాలాకాలం క్రిందట 'ఎ ఫిలిం బై అరవింద్‌' సినిమాలో నటించింది షెర్లీన్‌. అప్పట్లో ఈ బ్యూటీ పేరు మోనా చోప్రా. ఆ తర్వాత పేరు మార్చుకుని, ఒకటీ అరా బాలీవుడ్‌ సినిమాల్లో కన్పించింది. తన గ్లామర్‌ స్థాయి హాలీవుడ్‌.. అంటూ, హాలీవుడ్‌ ప్రయత్నాలు చేసి, చివరికి 'ప్లే బాయ్‌ మ్యాగజైన్‌' కవర్‌ పేజ్‌తో సరిపెట్టుకుని, బ్యాక్‌ టు పెవిలియన్‌ ఇండియన్‌ సినిమా.. అంటూ వచ్చేసింది. కానీ, ఇక్కడామెకు అవకాశాల పరంగా రెడ్‌ కార్పెట్‌ ఎవరూ పరిచేయలేదు. చేసేది లేక, ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, బ్లూ ఇన్నర్‌ వేర్‌లో షెర్లీన్‌ 'బ్యూటీ' పీక్స్‌లో వుందని ఒప్పుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS