నాటీ హాటీ 'హాలోవిన్‌' చూస్తారా.?

మరిన్ని వార్తలు

బ్లాక్‌ హాట్‌ అందాల రాక్షసిని చూస్తున్నారా.? షెర్లీన్‌ చోప్రా. భలే క్యూట్‌గా ఉంది కదా. అలాగే హాట్‌గా కూడా. హాలోవిన్‌ వేడుకల్లో భాగంగా షెర్లీన్‌ చోప్రా అలియాస్‌ మోనా చోప్రా ఇదిగో ఇలా భయపెట్టేసింది. భయపెడుతూనే అందంతో చంపేస్తోందీ ముద్దుగుమ్మ. బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో తలపై కొమ్ముల్లాంటి ప్రాపర్టీస్‌తో ఇదిగో ఇలా మన ముందుకొచ్చేసింది. హాలోవిన్‌ వేడుకల్లో అమ్మడు ఇదిగో ఈ గెటప్‌లోనే డాన్సులేయనుందట. మొన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో హాలోవిన్‌ వేడకలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలతో మెగా ఫ్యామిలీ నెట్టింట్లో నెటిజన్స్‌ని భయపెట్టేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ వంతొచ్చింది. షెర్లీన్‌ చోప్రా అంటే తెలుగులో 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమే. డిఫరెంట్‌ షేడ్స్‌లో స్కిన్‌ షో చేస్తూ, ఎప్పుడూ సంచలనం కావాలనుకునే ఈ బ్యూటీ ఈ సారి హాలోవిన్‌ పేరు చెప్పి తన అందాల్నిలా ప్రదర్శనకు పెట్టేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS