తెలుగు నుంచి 'మ‌హాన‌టి' మాత్ర‌మే

By iQlikMovies - October 31, 2018 - 17:35 PM IST

మరిన్ని వార్తలు

సావిత్రి జీవిత క‌థ `మ‌హాన‌టి`గా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.  

ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌దర్శ‌న కోసం `మ‌హాన‌టి` ఎంపికైంది. కీర్తి సురేష్‌, స‌మంత‌, స‌ల్మాన్ దుల్క‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) ఉత్స‌వాలు  త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్నాయి. అందులో భాగంగా `మ‌హాన‌టి`ని ప్ర‌ద‌ర్శిస్తారు.  హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం, తుళు... ఇలా భార‌తీయ భాష‌ల నుంచి 22 చిత్రాలు ఈ చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకున్నాయి. తెలుగు నుంచి ఆ గౌర‌వం మ‌హాన‌టికి మాత్ర‌మే ద‌క్కింది.

 బాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు సృష్టించిన `ప‌ద్మావ‌త్‌` కూడా ప‌నోర‌మాకు స్థానం సంపాదించుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS