బాలీవుడ్‌లో డ్రగ్స్ రగడ తారాస్థాయికి చేరింది. రియా చక్రవర్తి ఇప్పటికే అరెస్ట్ కాగా, రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు దీపికా పడుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను ఎన్సీబీ విచారించనున్న విషయం విదితమే. వీరిలో ఎవరు అరెస్ట్ అవుతారు.? అన్న విషయమై బోల్డన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది మామూలు విచారణ తప్ప, అరెస్టుల దాకా వ్యవహారం వెళ్ళకపోవచ్చనే వాదనా లేకపోలేదు. మరోపక్క, ఈ డ్రగ్స్ వ్యవహారం పేరుతో పాపులారిటీ పొందేందుకు చాలామంది అందాల భామలు అత్యుత్సాహం చూపుతున్నారు.
ఈ లిస్ట్‌లో అందరికన్నా ముందుండే పేరు కంగనా రనౌత్. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సెక్సీ భామ చేరిపోయింది. ఆమె ఎవరో కాదు షెర్లీన్ చోప్రా. సోషల్ మీడియా వేదికగా తన బూతు వీడియోలు షేర్ చేయడం ద్వారా పాపులారిటీ పెంచుకుంటోన్న షెర్లీన్ చోప్రా, ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన పార్టీలో క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ సేవిస్తూ కనిపించారంటూ ఓ బాంబు పేల్చింది. అయితే, ఆ క్రికెటర్లు, క్రికెటర్ల భార్యలు ఎవరు.? అన్నది మాత్రం ఆమె చెప్పలేదు. కంగన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేసింది.. అయితే, ఆమె సినీ పరిశ్రమ మీదనే చేసింది.
షెర్లీన్ ఓ అడుగు ముందుకేసి, క్రికెటర్ల కుటుంబాల్లో చిచ్చు పెడుతోందన్నమాట. ఇంతకీ, షెర్లీన్‌ని ఆ పార్టీని ఎవరు పిలిచారు? ఎందుకు పిలిచారు? అన్నది తెలియాల్సి వుంది. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆరోపణలు చేస్తే సరిపోతుందా? ఆధారాలుండాలి కదా!