వయసు పెరిగినా గ్లామర్‌లో మాకెవ్వరూ సాటి రారనిపిస్తున్నారు కొందరు సీనియర్ భామలు. వారిలో ముద్దుగుమ్మ శిల్పా శెట్టి స్థానం మొదటిదే అని చెప్పాలి. హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటి నుండీ, ఒకే రకమైన ఫిజిక్‌తో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. యోగాసనాలు వేస్తూ తన శరీరాకృతిని మరింత వయ్యారంగా మలచుకుంటోంది. ఫ్యాషన్ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఇదిగో చూడండిలా పట్టుచీర అంటే ట్రెడిషనల్ వేర్‌కి ప్రతీక. కానీ పట్టుచీరని ఇంత ట్రెండీగా కట్టి చూపించిన శిల్పాశెట్టిని ఏమనాలి. ఫ్యాషన్ రంగంలో ఎంతో పాషన్ ఉంటే తప్ప ఇలాంటి థాట్స్ రావు. పట్టుచీరలో ఇంతందంగా గ్లామర్ ఒలకబోస్తున్న యోగా బ్యూటీ శిల్పాశెట్టి నువ్వు సూపరో సూపర్.