టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌లో భాగంగా, చివరి బజర్ మోగేసరికి ఎంచుకున్న నంబర్ల వద్ద ఒక్కో కరటెస్టెంట్ నిలబడాల్సి ఉండాలని టాస్క్‌లో రూల్. అయితే, వాదోపవాదాల అనంతరం శివజ్యోతి ఏ నెంబర్‌నీ ఎంచుకోకుండా, పంతానికి పోయి, వితిక నెంబరే తనకు కావాలంటూ, అక్కడే నిలబడిపోయింది. శివజ్యోతి చేసిన పనికి నలుగురు ఇంటి సభ్యులు మాత్రమే నామినేట్ అవ్వాల్సిన ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అవ్వాల్సి వచ్చింది. శ్రీముఖి కోసం బాబా భాస్కర్ తన నెంబర్ వన్ ప్లేస్‌ని త్యాగం చేశాడు.
అలీ అడిగిన తీరు నచ్చి, తనకెంతో క్లోజ్ అయిన వితికకూ, తనపై ఫూలిష్‌గా గొడవకు దిగిన శ్రీముఖినీ కాదని, తన రెండో స్థానాన్ని ఆలీ రెజాకి ఇచ్చేసి తాను నామినేట్ అయ్యాడు రాహుల్. ఇక వరుణ్, వితిక కోసం త్యాగం చేసి మూడో స్థానాన్నిచ్చేశాడు. అయితే, ఈ ఎపిసోడ్ మొత్తానికి శ్రీముఖి - రాహుల్ గొడవ ఒక ఎత్తయితే, శివజ్యోతి చేసిన గొడవ మరో ఎత్తయ్యింది. చిట్టచివరికి శివజ్యోతి రచ్చకు ఎండ్ కార్డ్ పడకపోవడంతో, ఇంటి సభ్యులందర్నీ నామినేట్ చేసి బిగ్‌బాస్ ఈ కథకు ఎండ్ కార్డ్ వేసేశాడు. అలా ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా చాలా హాట్ హాట్‌గా సాగింది.