బిగ్‌బాస్ షోకి రాకముందు రాహుల్ - శ్రీముఖికి మధ్య మంచి స్నేహం ఉండేదట. అయితే, హౌస్‌లో అడుగు పెట్టాక, బద్ద శత్రువులుగా మారిపోయారు వీరిద్దరూ. అవకాశం దొరికితే చాలు, రాహుల్‌ని బదనాం చేసేందుకు శ్రీముఖి కంకణం కట్టుకుంటుంది. తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. టాపర్ ఆఫ్ ది హౌస్‌గా పేర్కొనబడిన ఈ టాస్క్‌లో కొన్ని చిట్టీలు ఇచ్చి, అందులోని నంబర్లకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఫోడియం వద్ద నిలబడాలి. టాప్ 3 నెంబర్లు వచ్చిన వారు ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్.
చివరిగా మిగిలిన నాలుగు నెంబర్ల కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉంటారు. అయితే, ఈ నలుగురూ, మొదటి స్థానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో, వారి కంటే తాము బెటర్ అని వారిని కన్విన్స్ చేయగలిగితే, ఆ నెంబర్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలో రెండో స్థానంలో ఉన్న రాహుల్ వద్దకు వెళ్లి నువ్వు నాకంటే ఏ విషయంలో బెటర్.. అంటూ ఆయా టాస్క్‌ల గురించి చెప్పుకొచ్చింది. దాంతో రాహుల్ ఏమాత్రం తగ్గలేదు. నీకంటే నేను చాలా బెటర్.. టాస్క్‌ల్లో నీ పర్‌ఫామెన్స్ కన్నా, నా పర్‌ఫామెన్సే బెటర్‌గా ఉంటుంది.. జన్యూన్‌గా ఉంటుంది.. అంటూ శ్రీముఖిని వారించే ప్రయత్నం చేశాడు.
కానీ, మాటలతో రాహుల్‌ని పెచ్చగొట్టే ప్రయత్నం చేసి, మాటల ద్వారా రాహుల్ హద్దులు మీరేలా చేసింది. ఆ క్రమంలో 'గయ్యాలీ గంప' అని శ్రీముఖిపై నోరు జారేశాడు రాహుల్. రాహుల్ వీక్‌నెస్ ఏంటో శ్రీముఖికి బాగా తెలుసు. ఆ వీక్‌నెస్‌పై కొట్టి, రాహుల్‌ని బదనాం చేయాలనుకున్న తన వ్యూహం ఫలించింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అంటూ రాహుల్‌ని నిలదీసింది. నిజానికి కన్విన్సింగ్‌గా అడిగితే, రాహుల్, ఆ స్థానాన్ని శ్రీముఖికి ఇచ్చేవాడేమో. కానీ, తన వ్యూహ రచన ఫలించడం కోసం శ్రీముఖి అంత రచ్చ చేసింది.