వరుణ్‌తో గొడవ: బట్టబయలైపోయిన శివజ్యోతి.!

By Inkmantra - October 15, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ అంకం చివరి దశకు చేరడంతో కథ మంచి రసపట్టు అందుకుంది. మొత్తం ఏడుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు ప్రస్తుతం. ముగ్గురు ఆడవాళ్లు, నలుగురు మగాళ్లు మాత్రమే. ఇక లేటెస్ట్‌ ఎపిసోడ్‌ నామినేషన్‌ ప్రక్రియతో మాంచి రసపట్టు మీద సాగింది. నామినేషన్‌ ప్రక్రియ ఈ సారి అంత సులువుగా జరగలేదు. గొడవలు, వాదులాటల మధ్య చాలా చాలా ఆసక్తికరంగా నడిచింది. ఓ వైపు రాహుల్‌, శ్రీముఖి గొడవ ఎపిసోడ్‌ని ఓ లెవల్‌కి తీసుకెళితే, వరుణ్‌ - శివజ్యోతిల మధ్య జరిగిన డిస్కషన్‌ ఈ ఎపిసోడ్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది.

 

వరుణ్‌ తన స్థానాన్ని తన భార్య వితిక కోసం త్యాగం చేశాడు. నిజానికి అది త్యాగం కాదు. మెడాలియన్‌ టాస్క్‌లో వితిక చేసిన పర్‌ఫామెన్స్‌ నచ్చి, ఆ ప్లేస్‌లో తానుంటే, ఖచ్చితంగా వితిక కన్నా బెటర్‌ పర్‌ఫామెన్స్‌ ఇవ్వలేననీ, సో నా కన్నా వితిక బెటర్‌ అని భావించి, ఆ స్థానం కోసం వితిక వరుణ్‌ని కన్విన్స్‌ చేసిన తీరు నచ్చి, ఆ ప్లేస్‌ని వితికకు ఇచ్చేశాడు వరుణ్‌. కానీ, భార్య కాబట్టి ఆ ప్లేస్‌ ఇచ్చేస్తావా? అని శివజ్యోతి రీజన్‌లెస్‌గా వరుణ్‌పై యుద్ధానికి దిగింది. చాలా సేపు వాదోపవాదాలు జరిగాయి. మాటలు హద్దులు దాటాయి.

 

'మొగుడు'.. 'పెళ్లాం'.. అంటూ అనవసరమైన టాపిక్స్‌ ఎత్తి శివజ్యోతి రచ్చ చేసింది. ఈ డిస్కషన్‌లో శివజ్యోతి వాదనను నెటిజన్లు తప్పు పడుతున్నారు. వరుణ్‌, వితికలను సమర్ధిస్తున్నారు. భార్య, భర్తలుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, వరుణ్‌, వితకలు మామూలు కంటెస్టెంట్స్‌ మాదిరిగానే లీడ్‌ చేశారు. బిగ్‌బాస్‌ వారికి కొన్ని అదనపు కేటాయింపులిచ్చినా, వారెప్పుడూ వాటిని మిస్‌ యూజ్‌ చేయలేదు. అడ్వాంటేజ్‌ తీసుకోలేదు. అలాంటిది, ఈ తాజా ఎపిసోడ్‌లో శివజ్యోతి అనవసరంగా వారిపై నోరు పడేసుకుని, తన బుద్ధి బయటపెట్టేసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS