నాని డైరెక్టర్‌తో దేవరకొండ ఫిక్స్‌.!

మరిన్ని వార్తలు

నానితో 'నిన్ను కోరి' సినిమా తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సినిమా తాజాగా అనౌన్స్‌ చేశారు. దిల్‌ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబో మూవీని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కెనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

 

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' అంటూ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు, డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌తో 'ఫైటర్‌' సినిమా చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ లోగా తన తదుపరి ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసి మన బంగారు కొండ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు. నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా 'నిన్నుకోరి'ని తెరకెక్కించి విమర్శకులు ప్రశంసలు అందుకున్న శివ నిర్వాణ, ఈ ఏడాది సమంత, నాగ చైతన్యతో 'మజిలీ' చిత్రాన్ని తెరకెక్కించి చైతూకి మంచి హిట్‌ అందించాడు. మరి, విజయ్‌ దేవరకొండ కోసం ఎలాంటి స్క్రిప్టు సిద్ధం చేశాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS