'దర్బార్‌'కి షాక్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ!

మరిన్ని వార్తలు

సినిమా తీయడం ఓ ఎత్తు. తీసిన సినిమాని మార్కెట్‌ చేయడం మరో ఎత్తు. రిలీజ్‌కి సిద్ధం చేయడం ఇంకో ఎత్తు. రిలీజ్‌ దగ్గర పడే సమయానికి ఏ మూల నుండి ఏ రూపంలో ఏ ఆటంకం వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు దీనికి. అసలు వివరాల్లోకి వెళితే, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'దర్బార్‌' సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ నెల 9న 'దర్బార్‌' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్‌ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిసిటీ ఆకాశాన్నంటేసింది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దిమ్మ తిరిగే రేంజ్‌లో జరిగిపోయింది.

 

ఈ తరుణంలో 'దర్బార్‌' టీమ్‌కి ఓ షాక్‌ తగిలింది. సినిమాని నిలిపి వేయాలంటూ మలేషియాకి చెందిన డీఎమ్‌వై క్రియేషన్స్‌ సంస్థ చెన్నై హైకోర్టులో ఫిటీషన్‌ దాఖలు చేసింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్‌ తమ సంస్థకు 23 కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు తక్షణమే ఆ మొత్తం చెల్లించాలనీ, లేదంటే సినిమాని నిలిపి వేస్తామనీ ఆ ఫిటీషన్‌లో పేర్కొంది. 'రోబో 2.0' సినిమాతో పాటు, 'దర్బార్‌' సినిమాకీ నిర్మాణ భాగస్వామ్యం అందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. పిటిషన్‌ని విచారించిన మద్రాస్‌ హైకోర్టు సదరు సంస్థకు 4.90 కోట్లు చెల్లించాలనీ, తర్వాతే సినిమా రిలీజ్‌ చేయాలనీ లైకా ప్రొడక్షన్స్‌ని ఆదేశించింది. ఊహించని ఈ పరిణామాన్ని లైకా సంస్థ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS